ఎంపీడీవో కార్యాలయ భవనం ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు.
– పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి : మహాదేవ పూర్ మండల కేంద్రం లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సోమవారం పర్యటించి ఎంపిడిఓ కార్యాలయ భవనం , దసలి పట్టు చేనేత గదుల షెడ్ లను ప్రారంభించి అంగన్ వాడీ భవనం ,ప్రభుత్వ పాఠశాల కాంపౌండ్ వాల్ మొదలగు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు .సోమవారం భూపా లపల్లి జిల్లా మహాదేవ పూర్ మండల కేంద్రం లో పర్యటించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మహాదేవ పూర్ మండల కేంద్రంలో 1కోటి 20 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన ఎంపిడిఓ భవనాన్ని, 20 లక్షల నిధులతో నిర్మించిన దసలి పట్టు చేనేత గదుల షెడ్ లను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, స్థానిక ప్రజా ప్రతిందులతో కలిసి ప్రారంభించారు. గ్రామంలో 16 లక్షలతో నిర్మించే అంగన్వాడీ భవనాన్ని , 23 లక్షలతో నిర్మించే కేజిబీవి కాంపౌండ్ వాల్ ,, 24 లక్షలతో నిర్మించే సిడిపిఓ మీటింగ్ హల్ కు, సి.సి.రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తూ గ్యారెంటీ పథకాలను తప్పనిసరిగా ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. ప్రభుత్వ ఏర్పాటు చేసిన రెండు రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం , రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షల పెంపు వంటి కార్యక్రమా లను అమలు చేసిందని అన్నారు.నిన్న నిర్వహించిన రాష్ట్ర క్యాబినెట్లో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా వంటి గ్యారెంటీ పథకాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని త్వరలోనే ఆ పథకాలను ప్రజలకు అందజేస్తామని, చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు పనులు నిర్ణీత కాలంలో పూర్తిచేసి ప్రజలకు నీటినీ సరఫరా చేస్తామని అన్నారు.అనంతరం తస్సర్ కాలనీలోనీ శ్రీ గర్భ గౌరీ దేవాలయంలో గౌరీ దేవిని దర్శించుకొని పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో సంభందిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.