స్నిపర్ డ్రెసెస్ స్వాధీనం
డెస్క్:మావోయిస్టులు అధునాతన టెక్నాలజీ ఉపయోగించు కుంటున్నారు. ఇప్పటికే అధునాతన ఆయుధాలు ఉపయోగి స్తుండగా, తాజాగా భద్రతా బలగాలకు మావోలు వదిలి వెళ్లిన సామాగ్రిలో స్నిపర్ డ్రెస్ లు లభ్యమయ్యాయి. ఈ డ్రెస్లు ధరిస్తే వారు ఉండే ప్రదేశానికి అనుకూలంగా కలిసిపోయే అవకాశం ఉంది. దీంతో మావోలను గుర్తించడం భద్రతా బలగాలకు కష్టంగా ఉంటుంది. ఇటువంటి డ్రెస్ లు శనివారం భద్రతా బలగాలు భద్రాచలం ఏజెన్సీ అటవీ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు.