గంజాయి పట్టివేత – ఇరువురి పై కేసు నమోదు
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలో పాలెం ప్రాజెక్టుకు వెళ్లే దారిలో చొక్కాల గ్రామ సమీపంలో సోమవారం సాయం త్రం వెంకటాపురం పోలీసులు గంజాయిని పట్టుకు న్నారు. ఈ సందర్భంగా ఇరువురు వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకొని అరెస్టు చేశారు. ఈ మేరకు వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్, వెంకటాపురం సివిల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కొప్పుల తిరుపతిరావు ఆధ్వర్యంలో, మంగళవారం మీడియాకు గంజాయి కేసు ప్రెస్ నోట్ ను మీడియాకు విడుదల చేశారు. వెంకటాపురం సి.ఐ.బి. కుమార్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని పాలెం ప్రాజెక్టు రూట్లో చొక్కాల వద్ద సుర్జో లక్ష్మణ్, తక్రి నరేష్ అనే యువకులు అనుమానస్పదంగా సంచరిస్తూ, కొంతమందికి గంజాయి విక్రయిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు ను చూసి పారిపోయేందుకు యత్నింస్తుండగా వారిని అదుపులో తీసుకొని వారి వద్ద నుండి ఐదు కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు లక్షా 26 వెలరూపాయలకు పైగా విలువ ఉంటుందని అంచనా వేశారు. ఈ సందర్భంగా వెంకటాపురం సి.ఐ .బి. కుమార్ మీడియాతో మాట్లాడుతూ, యువత దుర్వేశసనాలకు బానిస కాకూడదని, అలాగే గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తు ను పాడు చేసు కోవద్దని కోరారు. ఎవరైనా గంజాయి నీ విక్రఇంచిన ,కలిగియున్న ,సేవింఛిన సేవించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ సందర్భంగా సి.ఐ.బి. కుమార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం సివిల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కే. తిరుపతిరావు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.