వడ్లంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి : ఎస్సై మహేందర్
పెద్ద కోడపగల్, తెలంగాణ జ్యోతి : మండలంలోని వడ్లం గ్రామంలో బుధవారం రాత్రి పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి 8 మందిని పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. వారి వద్ద నుండి 30వేల రూపాయలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపా రు. మండలంలో ఎక్కడైనా పేకాట అడుతే వారిపైన పేకాట స్థావరాలపై కఠిన చర్యలు తీసుకోని వారిపై కేసు నమోదు చేస్తామన్నారు. ఎవరైనా సమాచారం అందిస్తే, వారి పేరు గొప్యంగా ఉంచుతామని ఎస్సై మహేందర్ తెలిపారు.