రక్తదానం .. మరొకరికి ప్రాణదానం..
– జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్
ములుగు ప్రతినిధి : రక్తదానంతో మరొకరికి ప్రాణదానం చేయొచ్చని జిల్లా ఎస్పీ డాక్టర్ పి శబరీష్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం ములుగు పోలీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల త్యాగలను మరువలేమని, ప్రజల శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రాణత్యాగాలు చేయడం వారి నిబద్ధతకు నిదర్శనం అన్నారు. అసాంఘిక శక్తుల నుండి కాపాడడంలో భాగంగా సమాజం కోసం, దేశం కోసం పోలీస్ అమరవీరులు తమ విలువైన ప్రాణాలను త్యాగం చేశారని, వారి త్యాగాలను ఎప్పటికి వెలకట్టలేమ న్నారు. వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని వేరొకరి ప్రాణా లను కాపాడడంలో ముందడుగు వేస్తూ ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగినదని, ఆపదలో ఉన్న వారి ప్రాణా లను రక్షించడానికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నా రు. కాగా, జిల్లా అదనపు ఎస్పీ ఏ అర్ సదానందం, ఆర్ఐ తిరుపతిరెడ్డి, ఇతర పోలీస్ సిబ్బంది 50 యూనిట్స్ రక్తదానం చేశారు. అనంతరం రక్తదానం చెసిన వారీకి ఎస్పీ ప్రశంసా పత్రాలను అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ములుగు సీఐ శంకర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ సంతోష్, ములుగు ఎస్ఐ వెంకటేశ్వర్లు, జిల్లా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.