కొంగాల వాటర్ ఫాల్స్ లో వ్యక్తి గల్లంతు
– గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా వాజేడు మండల పరిధి లోని కొంగాల వాటర్ ఫాల్స్ లో వ్యక్తి గల్లంతైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది.కొంగాల వాటర్ ఫాల్స్ ను సంద ర్శించేందుకు అనుమతి లేనప్పటికీ కొందరు వ్యక్తులు పర్యా టకుల దగ్గర డబ్బులు తీసుకుని రహస్యంగా పంపిస్తున్నా రు. ఈ తరహాలో అక్కడికి వెళ్లిన అభినవ్(17) ఘట్కేసరి అనురాగ్ యూనివర్సిటీ లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతు న్నాడు ఆ వ్యక్తి కొంగల వాటర్ ఫాల్స్ లో స్నానం చేస్తూ గల్లం తు అయ్యాడు. ఇది తెలుసుకున్న స్థానిక వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్ గాలింపు చర్యలు చేపట్టారు. కానీ గల్లంతైన వ్యక్తి ఆచూకీ ఇంకా లభించలేదు పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.