ఖో ఖో క్రీడాకారులకు సన్మానం
తెలంగాణజ్యోతి,ఏటూరునాగారం : తెలంగాణ సబ్ జూని యర్ బాలుర ఖో ఖో జట్టులోని వరంగల్ జిల్లా ఖో ఖో క్రీడా కారులు మాసయ్య, రవి లకు వరంగల్ జిల్లా ఖో ఖో సంఘం ఘన స్వాగతం పలికింది. ఇటీవల ఝార్ఖండ్ రాష్ట్రంలో జరి గిన జాతీయస్థాయి సబ్ జూనియర్ ఖో ఖో పోటీలలో వెండి పతకం సాధించిన తెలంగాణ బాలుర జట్టులోని వరంగల్ జిల్లా ఖో ఖో క్రీడాకారులు మాసయ్య మరియు రవి లకు నిన్న వరంగల్ జిల్లా ఖో ఖో సంఘం మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలంపిక్ సంఘం ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్లో ఘనస్వాగతం పలికి క్రీడాకారులను సన్మానించారు. జాతీయ స్థాయి పోటీలలో ఉత్తమ డిఫెండర్ గా అవార్డు అందుకున్న మాసయ్యను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం లో వరంగల్ జిల్లా ఖో ఖో సంఘం ప్రతినిధులు తోట శ్యాం ప్రసాద్, కుసుమ సదానందం, రమణ, గోనెల సదానందం, రంజిత్, రాజేందర్, హనుమకొండ జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ ఖో ఖో కోచ్ రాజారపు రమేష్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలంపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కైలాస్ యాదవ్, మహ బూబాబాద్, భూపాలపల్లి జిల్లాల క్రీడల అధికారులు అనిల్ కుమార్, చిర్ర రఘు పాల్గొన్నారు.