ఇసుక లారీల దుమ్ము ధూళీతో విసుగెత్తిన ప్రజలు.
- వీరాపురం గ్రామం వద్ద రాస్తారోకో.
- భారీగా నిలిచిపోయిన వాహనాలు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం చర్ల రహదారిలో శుక్రవారం మధ్యాహ్నం నుండి వెంకటాపురం శివారు వీరాపురం గ్రామం వద్ద రాస్తారోకో కారణంగా ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డు మరమ్మతులు, నిర్మాణం పేరుతో రోడ్లు భవనాల శాఖ కాంట్రాక్టర్ మెటల్పరిచి బీటీ వేయకుండా నిర్లక్ష్యంగా వదిలేయడంతో, ఇసుక లారీల దుమ్ము ధూళితో, ప్రధాన రహదారి కి ఇరువైపులా ఉన్న అనేక గ్రామాల ప్రజలు దుమ్ముథూళీతో శ్వాసకోశ వ్యాధులతో, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నారు. పలుమార్లు అధికారులకు ఆందోళనతో విన్నవించుకున్న పట్టించుకోకపోవడంతో, విసిగి చెందిన ఉఫ్ఫేడు వీరాపురం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు శుక్రవారం మధ్యాహ్నం రోడ్డుపైకి వచ్చి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా చర్ల నుండి వెంకటాపురం వైపు ఇటువైపు నుండి అటు వైపు వెళ్లే లారీలు ఇతర వాహనాలు కిలోమీటర్ల పొడవున నిలిచిపోయాయి. దీంతో బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఇతర వాహనదారులలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం వెంకటాపురం పోలీస్ లకు తెలియపరచడంతో, ఆందోళనకారులతో సంప్రదింపులు జరిపి, దుమ్ము ధూళి లేకుండా నీళ్లు చల్లిస్తామని, రోడ్లపైకి వచ్చి వాహనాలు నిలిపివేసి ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని ఈసంధర్భంగా అధికారులు ప్రజలకు అవగాహన కల్ఫించినట్లు సమాచారం.
1 thought on “ఇసుక లారీల దుమ్ము ధూళీతో విసుగెత్తిన ప్రజలు. ”