కేంబ్రిడ్జ్ పాఠశాల పై చర్యలు తీసుకోవాలి
యూఎస్ఎఫ్ ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బోనాల సునీల్ చారి.
తెలంగాణ జ్యోతి , కాటారం ప్రతినిధి: మండల కేంద్రంలో గల కేంబ్రిడ్జ్ పాఠశాల పై చర్యలు తీసుకోవాలని యు ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బోనాల సునీల్ చారి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో వినతి పత్రం అందచేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మండల కేంద్రంలో గల కేంబ్రిడ్జ్ పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా విద్యా ప్రమాణాలను పాటించకుండా పాఠశాల యాజమాన్యం విద్యాశాఖ నిబంధనలను తుంగలో తొక్కుతూ యథేచ్ఛగా నిర్వహిస్తున్నా విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు విద్యా ప్రమాణాలలో ఏ ఒక్కటి కూడా పాటించకుండా జీవో :1,41,91 లను బేఖాతారు చేస్తూ విద్యార్థుల కనీస సౌకర్యాలైన మరుగుదొడ్లు సరిగా లేకుండా నడిపిస్తు న్నారన్నారు. ప్రభుత్వ ఆమోదం లేకపోయినా కేంబ్రిడ్జ్ కు ముందు ఏ 1 అని ప్రచురిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెడ్తూ ఫీజుల రూపంలో వేలాది రూపాయలు దండు కుంటున్నారని అదే విధంగా అసలు ఆమోదం లేకపోయినప్పటికీ పాఠశాల నిర్వహిస్తూ పదవ తరగతి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారు చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలో బోధించే సిబ్బందికి కనీస విద్యార్హతలు లేకపోయినా వారితో పాఠశాల నిర్వహిస్తూ విధ్యా ప్రమాణాలను తుంగలో తొక్కడమే కాకుండా విద్యార్థులు రవాణా చేయడానికి రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ బస్సులకు ఫిట్ నెస్ లేకుండా నడిపిస్తూ విద్యార్థుల జీవితాలతో ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న పాఠశాల యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకుని పాఠశాలను మూసివేయాలని వారు డిమాండ్ చేశారు.
1 thought on “కేంబ్రిడ్జ్ పాఠశాల పై చర్యలు తీసుకోవాలి”