పెనుగోలు గుట్ట ఆశా వర్కర్ గుండెపోటుతో మృతి

పెనుగోలు గుట్ట ఆశా వర్కర్ గుండెపోటుతో మృతి

పెనుగోలు గుట్ట ఆశా వర్కర్ గుండెపోటుతో మృతి

– వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సంతాపం

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి :  ములుగు జిల్లా వాజేడు మండలం గుమ్మడిదొడ్డి పంచాయతీ దట్టమైన అడవి ప్రాంతంలో కొండలపై ఉన్న పెనుగోలు గ్రామంలో గత 26 సంవత్సరాల నుండి ఆశా వర్కర్ గా కొండపై నివసిస్తున్న ఆదివాసి కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తున్న ఉయిక సమ్మక్క గుండెపోటుతో మృతి చెందారు. సుమారు పదిహేను కిలోమీటర్లు కాలినడకన గ్రామస్తులతో కలిసి వచ్చి ప్రాదమిక ఆరోగ్య కేంద్రం నుండి మందులను తీసుకుని వెళ్లి సుమారు 30 కుటుంబాలు కలిగిన పెనుగోలు గిరిజనులకు వైద్య సేవలను అందిస్తున్న సమ్మక్క మృతి పట్ల గ్రామస్తులు, వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. ఆమె చేసిన సేవలు మరువరానివని కొండలపై నివసిస్తూ పెనుగోలు గ్రామస్తులకు వైద్య సేవలు అందిస్తున్న సమ్మక్క మృతి తీరని లోటు అని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కొమరం మహేందర్, ఆరోగ్య విస్తరణ అధికారి కుప్పిలి కోటిరెడ్డి ,ఆశా వర్కర్లు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పెనుగోలు గ్రామంలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె పార్థివ దేహంపై పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులర్పించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment