విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలి

విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలి

విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలి

– హనుమకొండ జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ పోరిక రవీందర్, డాక్టర్ ఎం శ్రావణ్ కుమార్

ములుగు, తెలంగాణ జ్యోతి: విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత ను వెలికి తీయడానికి కృషి చేస్తున్న సన్ రైజర్స్ హై స్కూల్ యాజమాన్యాన్ని అభినందిస్తూ, ఫుడ్ ఫెస్టివల్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలకు ప్రాధాన్యత గురించి తెలియజేయడానికి ఫుడ్ ఫెస్టివల్స్ దోహదపడతాయన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రకాల వంటకాలు రుచికరంగా ఉన్నాయని తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ పెట్టెం రాజు, వైస్ ప్రిన్సిపాల్ బల్గూరి జనార్ధన్, ఉపాధ్యాయ బృందం విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment