అంగన్వాడి టీచర్ల పెండింగ్ జీతాలు మంజూరు చేయాలి
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : పదోన్నతి పొందిన అంగన్వాడి టీచర్ల పెండింగ్ జీతాలను మంజూరు చేయాలని కోరుతూ వెంకటాపురం మండల సిడిపిఓకి పదోన్న తి పొందిన అంగన్వాడి టీచర్లు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మినీ అంగన్వాడి టీచర్లను పూర్తిస్థాయి టీచర్లుగా పదోన్నతి కల్పిస్తూ జనవరి 2024 నుండి నెలకు 13,650 రూ. చెల్లించాలని ప్రభుత్వం ఆదేశా లు జారీ చేసింది. కాగా, ఫిబ్రవరి 2024 నెలలో 13,650, మే నెలలో 13,650, జూన్ నెలలో 13,650.రూ. వంతున అంగన్వాడి టీచర్లకు పదోన్నతపై జీతభత్యాలు పెంచి మం జూరు చేశారు. అయితే మార్చి, ఏప్రిల్, జూలై నెలలలో సగం జీతం రూ. 7,800 మాత్రమే చెల్లించారని మిగతా సగం జీతం డబ్బులు ఇవ్వలేదని పదోన్నతి అంగనవాడి టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే తమ సమస్యను పరిష్కరించి బకాయి పడ్డ మూడు నెలల సగం జీతం డబ్బులను చెల్లించి తమకు న్యాయం చేయాలని వినతి పత్రంలో వారు కోరారు.