పిఎసిఎస్ చైర్మన్ చల్ల తిరుపతి రెడ్డికి సన్మానం
మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి : మహదేవపూర్ పిఎసిఎస్ చైర్మన్ చల్ల తిరుపతి రెడ్డి ని మంగళవారం కరీంనగర్ కేడీసీసీ, నాప్కాబ్ బ్యాంక్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు శాలువాతో సన్మానించారు. మహాదేవపూర్ పిఎసిఎస్ కు (ఎన్ సి డి సి ) జాతీయ కో-ఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ 2023 సంవత్సరానికి గాను ఎక్సులెన్సి అవార్డు రావటం పట్ల హర్షం వ్యక్తం చేసిన రవీందర్ రావు కరీంనగర్ లోని తన కార్యాల యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. మహాదేవపూర్ సంఘం అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని రవీందర్ రావు అన్నారు. ఈ కార్య క్రమంలో చైర్మన్ తిరుపతి రెడ్డి తో పాటు మహాదేవపూర్ పిఎసిఎస్ డైరెక్టర్ దాసరి సమ్మయ్య ఉన్నారు.