ఎన్నికల సమయంలో రైతుల కు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
– బిజెపి కిసాన్ మోర్చా డిమాండ్
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వెంకటాపురం మండల బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం రెవెన్యూ కార్యాల యంలో వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాల ని, తాసిల్దార్ కార్యాలయంలో సీనియర్ యూ డి సి కి మెమోరాండం అందజేశారు. బిజెపి కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు తోట సతీష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కమిటీల పేరుతో కాలయాపన చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసే చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో చేర్చిన విధంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుల బ్యాంకు రుణాలను రూ.2 లక్షల వ్యవసాయ రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కమిటీలను వేసి రైతులను అయోమయానికి గురి చేస్తున్నా రన్నారని విమర్శించారు. రైతు భరోసా పేరుతో సాగు చేస్తున్న ప్రతి ఎకరానికి రైతు భరోసా 15 వేలు ఆర్థిక తోడ్పాటును అందించాలన్నారు.కౌలు రైతుకు రాష్ట్ర ప్రభుత్వం సంవత్స రానికి 15 వేలు, వ్యవసాయ కూలీలకు 12 వేలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని, కిషన్ మోర్చా మండల అధ్యక్షులు తోట సతీష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు అట్లూరి రఘురాం, మండల ప్రధాన కార్యదర్శి సాధన పల్లి విజయ్ కుమార్, సీనియర్ నాయకులు సంకా హేమ సుందర్, వీరభద్రారం భూత్ అధ్యక్షుడు రాజు, చక్రపాణి యువ మోర్చా నాయకుడు కిషన్ తదితరులు పాల్గొన్నారు.