అధిక లోడు ఇసుక లారీలు పట్టివేత

అధిక లోడు ఇసుక లారీలు పట్టివేత

 – 11 ఇసుక లారీలను సీజ్ చేసిన వాజేడు పోలీసులు. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వాజేడు మండలంలో, వాజేడు పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా, ప్రభుత్వం నిర్దేశించిన డీ.డీ.లకంటే అధికలోడుతో ఇసుకను అతివేగంగా నిర్లక్ష్యంగా నడుపుతున్న 11 లారీలను తనిఖీ చేసి సీజ్ చేశారు. వాజేడు పోలీస్ స్టేషన్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ చవళ్ళ వెంకటేశ్వరరావు ఈ మేరకు మీడియాకు ప్రకటనను విడుదల చేశారు. వెంకటా పురం మండలంలోని ఎదిర పంచాయతీ ఒంటి చింతలగూ డెం, మరియు మొర్రవాని గూడెం గోదావరి ఇసుక ర్యాంపు ల నుండి ప్రభుత్వ డీ.డీ.ల కంటే ఒక్కొక్క లారీలో 4 నుండి, 5 టన్నుల ఇసుకను అక్రమంగా లారీలలో తరలిస్తున్నట్లు పోలీసుల తనిఖీలలో వెల్లడయింది. శుక్రవారం సాయంత్రం అరుణాచలపురం గ్రామ సమీపంలో వాజేడు పోలీస్ ఎస్.ఐ. వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు చేయు చుండగా, నూగూరు వెంకటాపురం నుంచి .జగన్నాదపురం వైపు అతివేగంగా అజాగ్రత్తగా వస్తున్నటు వంటి అధిక ఇసుక లోడుతో కూడిన 11 లారీలను గుర్తించి, వెంటనే సమీపంలో ఉన్నటువంటి గౌరవప్రదమైన ఇద్దరు పంచుల సమక్షంలో ఇట్టి లారీలను తనిఖీలు చేయగా, ప్రతి లారీలో కూడా ప్రభుత్వ డి.డి.ల ప్రకారం ఉండవలసిన బరువు కంటే అదనంగా 4  నుంచి ఐదు టన్నుల ఇసుకను తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇట్టి లారీలు వెంకటాపురం మండలం మొర్రవాని గూడెం,ఒంటిచింతగూడెం గోదావరి ఇసుక ర్యాంపులకు సంబంధించినవిగా గుర్తించడమైనది. వెంటనే ఇట్టి లారీలను వాజేడు పోలీస్ స్టేషన్ కు తరలించి చట్టప్రకారం కేసులు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించి నట్టు తెలిపారు.వాజేడు మండల పరిధిలోని ఇసుక‌ ర్యాంపుల నుంచి ప్రభుత్వ నిర్దేశించిన ఇసుక కంటే ఎవరైనా అధికంగా తరలించినట్ల యితే లారీల పైన ,వారిపైన చట్టరీత్యా కేసులు నమోదు చేయబడుతాయ ని వాజేడు ఎస్.ఐ. వెంకటేశ్వరావు మీడియా కు విడుధల చేసిన ప్రకటనలో తెలిపారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment