రాజధాని ఎ.సి సర్వీస్ బస్సు ను ప్రారంభించిన ఆర్టీసీ అధికారులు
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : ఏటూరునాగారం మండల కేంద్రం నుండి హైద్రాబాద్ వరకు నడిచే ఆర్టీసీ ఏ.సి బస్ సర్వీస్ ను డి.ఎం జి.సురేష్ ఆధ్వర్యంలో ఏటూరు నాగారం స్థానిక సి. ఐ అనుముల శ్రీనివాస్,ఎస్ఐ తాజొద్దీన్ , ఏటూరు నాగారం స్పెషల్ ఆఫీసర్ రఘు, ఏటూరునాగారం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అఫ్జల్ లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిటమట రఘు,పెండ్యాల ప్రభాకర్ ,ఆర్టీసీ కంట్రోలర్ ఎస్.సత్తయ్య, ఎన్.శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇట్టి సర్వీస్ ఉదయం 11 గంటలకు ఎటూర్ నాగారం నుండి ఉప్పల్ వరకు సర్వీస్ నడపబడును.మరియు సాయంత్రం 5 గంటలకు ఏటూరు నాగారం నుండి హన్మకొండ వరకు బస్ సర్వీస్ నడపబడును. ఏ.సి బస్ చార్జి వివరాలు.. ఏటూరు నాగారం to ఉప్పల్ వరకు 620 రూపాయలు,ఏటూరునాగారం to హన్మకొండ 280రూ.చార్జిలు కలవు.ఇట్టి సదుపాయాన్ని ప్రజలు ఉపయో గించుకోగలరుఅని సత్తయ్య కంట్రోలర్ తెలిపారు