సిఐ, ఎస్ఐ లను సన్మానించిన ఓడ బలిజ సంఘం నాయకులు 

Written by telangana jyothi

Published on:

సిఐ, ఎస్ఐ లను సన్మానించిన ఓడ బలిజ సంఘం నాయకులు 

తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : ఏటూరునాగారం సిఐ అనుముల శ్రీనివాస్, ఎస్ఐ ఎస్.కె తాజుద్దీన్ లను సోమ వారం ఓడా బలిజ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. గోదావరి నది తీర ప్రాంతంలో ఉంటూ చేపల వృత్తినే ప్రధాన వృత్తిగా భావించి చేపల వేటను సాగిస్తూ జీవనం గడుపుతున్నామన్నారు. గోదావరి వరదలు సంభ వించినప్పుడు అత్యధికంగా ఓడ బలిజ లు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఓడ బలిజలకు సరైన గుర్తింపు లేకుండా పోయిందని ఇప్పుడి ప్పుడే తాము గుర్తింపు దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓడ బలిజ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గార ఆనంద్. రాష్ట్ర నాయకులు గార పోశాలు. బోటా రమణయ్య. నాయకులు గార మహేష్. బొల్లె పెద్దన్న. తోట నాగేశ్వరరావు. బొల్లె లచ్చ బాబు. తోట మహేష్. వంగాల వీరన్న. గార రవి. గారా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment