మండలంలో వేళాపాళా లేని కరంట్
తెలంగాణజ్యోతి, కన్నాయిగూడెం: కన్నాయిగూడెం మండ లంలో ఇష్టారాజ్యంగా విద్యుత్ సరఫరాలో కోతలు విధిస్తు న్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరంట్ ఎప్పుడు ఉంటుందో… ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థి తి. ఓ వైపు ఎండలు మండిపోతుండటం.. మరోవైపు ఉక్క పోతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉక్కపోతకు ఇళ్లల్లో ఉండలేక బయటకు రాలేక నరకయాతన పడుతు న్నారు. పల్లెల్లో సమయపాలన లేని కరంట్ కోతలపై జనం మండిపడున్నారు.చిన్న గాలి వీచినా, చినుకు పడిన కరెంట్ కట్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇలా చీటికి మాటికి విద్యుత్ నిలిపివేయడంతో కరంట్ తో ఆధారపడి పని చేసే చిరువ్యాపారులు, రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురువుతున్నామని తెలిపారు.24 గంటల కరంట్ ఏమో కాని ఐదారు గంటల కరంట్ సరిగా ఉండటం లేదని రైతులు వాపోతున్నారు.