ఎస్సై సార్.. వెల్ డన్…
తెలంగాణజ్యోతి, కన్నాయిగూడెం :కన్నాయిగూడెం మండ లం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన వృద్ధురాలు కావిరి ఎల్లక్కకు కావిరి భిక్షపతి, కావిరి ఎడయ్య, కవిరి బక్కయ్య, కవిరి సమ్మయ్య అనే నలుగురు కుమారులు ఉన్నారు. కొన్నాళ్ల నుంచి ఎల్లక్కను కొడుకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. చిన్న కొడుకు కవిరి సమ్మయ్య చాలా ఏళ్లుగా ఆమెను చూసుకుంటున్నాడు. కుటుంబ పోషణ భారం కావడంతో ఆమె కన్నాయిగూడెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ వెంకటేష్ కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. వారికి తల్లి ప్రాముఖ్యత గురించి ఎస్సై తెలిపారు. దీంతో నలుగురు కుమారులు తమ తల్లిని చూసుకునే బాధ్యత తీసుకోవడానికి అంగీకరించారు. ఎస్‌ఐ వెంకటేష్ కృషిని మండల ప్రజలు కొనియాడారు.