నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
– నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్. టి. ఏ) సంస్థను రద్దు చేయాలి
– ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హకీమ్ నవీద్ డిమాండ్
తెలంగాణ జ్యోతి, వరంగల్ : నీట్ పరీక్ష లో జరిగిన అవకతవకలపై సెట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హకీమ్ నవీద్ డిమాండ్ చేశారు. వరంగల్ లో జరిగిన ఏ.ఐ.ఎస్.బి ముఖ్య కార్యకర్తల సమావేశం లో ముఖ్య అతిథిగా హాజరైన హకీమ్ నవీద్ మాట్లాడుతూ నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలపై బహిర్గతం కావద్దని దురుద్దేశంతో హుటాహుటిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల రోజున నీట్ పరీక్ష ఫలితాలను ఆగమేఘాల మీద విడుదల చేసి విద్యార్థుల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేశారు అని హకీమ్ నవీద్ ఆరోపించారు N.T.A వైఫల్యం వల్ల లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో నెట్టి వేయబడింది అని ఆయన అన్నారు ఈ ఉదంతంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి ,NTA ను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు పిలుపునిస్తామని అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కన్వీనర్ రోహిత్, నగర నాయకులు అఖిల్, సుమన్,రాజు, సాయి హరీశ్ తదితరులు పాల్గొన్నారు.