రైతన్న లకు రెండు లక్షల రుణమాఫీ. 

Written by telangana jyothi

Published on:

రైతన్న లకు రెండు లక్షల రుణమాఫీ. 

– నూగూరు వెంకటాపురం మండల కాంగ్రెస్ పార్టీ హర్షం. 

వెంకటాపురం నూగూరు తెలంగాణజ్యోతి: ఎన్నికల హామీ ల్లో భాగంగా రైతులకు రెండు లక్షల రూపాయల బ్యాంకు రుణాలను మాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బాంధవుడుగా అన్నదాతల గుండెల్లో నిలిచిపోయారని మండల కాంగ్రెస్ పార్టీ హర్ష వ్యక్తం చేసింది. ఈ మేరకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడెం సాంబశివరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి, ముఖ్యమంత్రి మరియు ఎఐసిసి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ అగ్ర నాయకులకు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని, రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ లో చెప్పడం జరిగింది. సి.ఎమ్. రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ నీ ఎన్ని సమస్యలున్నా చేసి తీరుతానని వాగ్థానాలు చేశారు. అదే మాట మీద నిలబడి జూన్ 21తేదీన రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తో రెండు లక్షల రుణమాఫీకి ఆమోదం తెలియజేయడం జరిగినది. ఈ మేరకు వెంకటాపురం మండల కాంగ్రెస్ మరియు, కిసాన్ సెల్ ఆధ్వర్యంలో, మీడియా సమావేశం, ఏర్పాటు చేసి ఏ.ఐ.సీ.సీ. రాహుల్ గాంధీ , మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క , మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సహచర మంత్రులు అందరికీ వెంకటాపురం మండల కాంగ్రెస్ కమిటీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడెం సాంబశివరావు, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు జల్లిగంపల కళాధర్ రావు నాయుడు , యువ నాయకులు బాలసాని వేణు , ఎంపీటీసీ లు , సీతా దేవి, గార్లపాటి రవి ,నాయకులు గుండమల్ల కిరణ్, చిట్టెం వాసు మంచాల భూషణం ,చిట్టి మల్ల దేవా అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment