జగన్నాధపురం లో జాతీయ కుష్టి నిర్మూలన కార్యక్రమం.
వెంకటాపురం తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాధపురం గ్రామంలో శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ఆదేశాల మేరకు లెప్రసి నిర్మూలించాలని గ్రామస్తులకు వ్యాది పై అవగాహన కల్పించారు. ఆశా కార్యకర్తలు గ్రామాలలో, ఇంటింటికి వెళ్లి సర్వే చేయించి రాగి మచ్చలు మరియు, స్పర్శ లేని మచ్చని గుర్తించి వారికి వైద్యం అందించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య సిబ్బంది కి ఆదేశాలు జారిచేశారు. అదికారి పోరిక రవీంద్ర ఆదేశాల మేరకు గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. వ్యాధి సోకిన వారికి మానసిక ధైర్యం కల్పించి చికిత్స పొందే విధంగా ప్రోత్సహించాలని, శరీరంలో రాగి రంగు మచ్చలను గుర్తిస్తే, నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సంప్రదించగలరని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జగన్నాధపురం హై స్కూల్ హెచ్ఎం . స్కూల్ టీచర్లు, వైద్యాధికారి డాక్టర్. మధుకర్, డిపి ఏమో. జయరాజు, . హెల్త్ సూపర్వైజర్ కుప్పిలి కోటిరెడ్డి, ఏఎన్ఎం రాజేశ్వరి, టీచర్ కవిత, ఆశా కార్యకర్తలు. జ్యోతి, నాగమణి, నాగలక్ష్మి,. గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తథితరులు పాల్గొన్నారు.