ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ములుగు డిఎంహెచ్ఓ
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వాజేడు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అల్లం అప్పయ్య శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, మందుల నిల్వలు, పీహెచ్సి పరిధిలోని పల్లెదవాఖానాల నుండి అందుతున్న వైద్య సేవలు, ఇతర వైద్య పరమైన అంశాలపై రికార్డుల పరంగా పరిశీలించారు. వాజేడు వైద్యాధికారి డాక్టర్ కొమరం మహేందర్, డాక్టర్. మధుకర్, డాక్టర్ గ్యానస ఈ కార్యక్రమంలో పాల్గొని మండలంలో పిహెచ్పి ల ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలను వివరించారు. సిబ్బంది హాజరు పట్టికను జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య పరిశీలించి మెడికల్ ఆఫీసర్లకు, సిబ్బందికి పలు అంశాలపై ఆదేశాలు జారీ చేశారు .ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి కుప్పిలి కోటిరెడ్డి, స్రవంతి,. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ . జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్. పోరిక రవీందర్ తదతరులు పాల్గొన్నారు.