మూడోసారి ప్రధానిగా నరేంద్రమోదీ.
– బీజేపీతోనే దేశాభివృద్ధి
– ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రగామిగా నిలబెట్టాం
– బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్ రావు
– వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ములుగులో భారీ ర్యాలీ
తెలంగాణ జ్యోతి,ములుగు ప్రతినిధి : భారత దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన ప్రధాని మోదీని ముచ్చటగా మూడోసారి ప్రధానిగా చేయాలని, బీజేపీకి అత్యధిక స్థానాలు గెలుచు కోవాలంటే మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అజ్మీర సీతారాం నాయక్ ను గెలిపించుకోవాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం ములుగులో జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో అభ్యర్థి సీతారాం నాయక్ తో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, డోలు దెబ్బలతో స్థానిక శాంతి స్థూపం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ చౌక్ వద్ద గరికపాటి మోహన్ రావు మాట్లాడుతూ.. పదేళ్ల బీజేపీ పాలనలో నిరుపేద వర్గాలకు పథకాలను చేరువ చేసిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందన్నారు. 60ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి నిరోదకులుగా మారారని, ప్రధాని నరేంద్రమోదీని మరోసారి గెలిపించుకుంటే అంత్యోదయ లక్ష్యాన్ని పూర్తి చేస్తారన్నారు. ఇప్పటికే త్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370రద్దు, అయోధ్యలో బాల రామాలయం నిర్మించుకొని శాశ్వత పరిష్కారాం చూపారన్నారు. బీజేపీ అంటేనే అభివృద్ధి అని, ఇప్పటివరకు అవినీతి మరక లేని ప్రధాని నరేంద్రుని వైపు దేశ ప్రజలు ఉన్నారన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తారని చేస్తున్న ఆరో పణల్లో నిజం లేదని, కావాలనే దుష్ప్రచారం చేస్తున్నా రన్నారు. ప్రజా అవసరాలను తీర్చేందుకు అవసరమైన చట్టాల్లో మార్పు తీసుకువచ్చారని గుర్తు చేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ మాట్లాడుతూ గతంలో ఎంపీగా ఎన్నో సేవలు చేశానని, ఈసారి గెలిపిస్తే నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం, రామప్పకు యునెస్కో గుర్తింపు తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోదీదేనన్నారు. నీతి వంతమైన పాలన కావాలంటే తనను గెలిపించి కేంద్రంలో ప్రధానిగా మోదీకి మద్ధతు తెలపాలని పిలుపునిచ్చారు. గిరిజన విశ్వవిద్యాలయానికి శాశ్వత భవన సముదాయ నిర్మాణాన్ని చేపడుతామన్నారు. ములుగు జిల్లాలో టూరిస్టు హబ్ ను అభివృద్ధి చేసి యుతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. ఈ ర్యాలీలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, మానుకోట ప్రబారీ నూకల వెంకట నారాయణ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ ముస్కు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి, అసెంబ్లీ ఇన్చార్జి పి.నరోత్తంరెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్, గిరిజన మోర్చ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, సీనియర్ నాయకులు భూక్య రాజు నాయక్, జిల్లా పదాధికారులు దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, ఏనుగు రవీందర్రెడ్డి, భూక్య జవహర్ లాల్ నాయక్, కృష్ణాకర్ రావు, కర్రా సాంబశివరెడ్డి, ములుగు మండల అధ్యక్షుడు గాదం కుమార్, యూత్ అధ్యక్షుడు రాయంచు నాగరాజు, మద్దినేని తేజరాజు, మల్లెల రాంబాబు, కారుపోతుల యాదగిరిగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
1 thought on “మూడోసారి ప్రధానిగా నరేంద్రమోదీ.”