బీరన్నకు నాగెల్లి పట్నం.. అగ్నిగుండాలు దాటిన భక్తులు…

Written by telangana jyothi

Published on:

బీరన్నకు నాగెల్లి పట్నం.. అగ్నిగుండాలు దాటిన భక్తులు…

– ఆకట్టుకున్న ఒగ్గు కళాకారుల వీరగాథలు

– రేపటితో ముగియనున్న ఉత్సవాలు

ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : యాదవుల ఇల వేల్పు బీరన్న ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం ములుగులోని పత్తిపల్లి రోడ్డులోగల బీరన్న ఆలయం వద్ద నాగెల్లి పట్నం వేశారు. ఒగ్గు, బీరన్న పూజారులు, యాదవ కులపెద్దలు పట్నంవేసి భక్తులకు బండారి (పసుపు) అందజేశారు. కుటుంబ సభ్యులు, బంధువుల సమేతంగా వచ్చిన భక్తులకు ఉత్సవ కమిటీ సభ్యులు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. డోలు వాయిద్యాలతో ఒజ్జల లింగన్న ఇంటి నుంచి సల్ల మండువ బోనం తీసుకువచ్చిన కులపెద్దలు, పూజారులు అనంతరం నాగెల్లి పట్నం వేశారు. ఈ సందర్భంగా యాదవులు బీరన్నకు ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం ఆలయం వద్ద ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన అగ్నిగుండాన్ని భక్తశ్రద్ధలతో దాటి బీరన్నకు మొక్కుకున్నారు.

సాయంత్రం కామరాతి బీరన్నలను ఊరేగించారు. గురువారం కంకణాలు కట్టి, యాట మొక్కులు చెల్లిచడంతో పాటు, మహంకాళీ బోనాలు తిరిగి ఇళ్లకు చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ, పూజా కమిటీ సభ్యులు గోపు చంద్రమళ్లు, గొర్రె అంకూస్, బైకాని చిన్న కొమురయ్య, బైకాని బైకులు, ఇమ్మడి రమేష్, కొనుపుల కుమార్, బైకాని సాగర్, గుండెబోయిన కుమార్, బైకాని నటరాజ్, బండారి కుమార్, జక్కుల రమేష్, గోపు బొందయ్య, బోయిని రాజు, బోళ్ల రవి, గుండెబోయిన పోశాలు, ఎల్లావుల సమ్మయ్య, గండ్రకోట కుమార్, ఇమ్మడి మల్లయ్య, బైకాని ప్రకాష్, బైకాని రాజశేఖర్, ఇమ్మడి రాజు, బొంతల వేణు, ఒజ్జల కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Tj news

1 thought on “బీరన్నకు నాగెల్లి పట్నం.. అగ్నిగుండాలు దాటిన భక్తులు…”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now