పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్యయత్నం
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : కాళేశ్వరం గోదావరి వద్ద గుర్తు తెలియని మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. స్థానికులు గమనించి ఎస్సై భవాని సేనుకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన సిబ్బందితో కలిసి వచ్చి ఆ మహిళను పరిశీలించగా కొట్టు మిట్టాడు తుంది. గోదావరి నుంచి ఇసుకలో ఎడ్ల బండి ద్వారా తీరంపైకి ఎస్సై తమ పోలీస్ సిబ్బంది తో కలిసి తీసుక వచ్చారు.అనంతరం108కు సమాచారం ఇవ్వడంతో ఆమెను హుటాహుటిన మహాదేవపూర్ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మహిళను హోంగార్డు సహాయంతో భూపాలపల్లి 100 పడకల ఆసుపత్రికి తరలించారు. ఈమె వివరాలు సిరోంచా తాలూకా పోచంపల్లికి చెందిన రామక్క బజూరి గా పోలీసులు గుర్తించారు.
1 thought on “పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్యయత్నం”