మున్నూరు కాపు సంఘం నేత పుప్పాల నాగేశ్వరరావు మృతి
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రం చెందిన ప్రముఖ రైతు, మున్నూరు కాపు సంఘం సీనియర్ నేత, పుర ప్రముఖులు పుప్పాల నాగేశ్వరావు సోమవారం అనారోగ్యంతో వారి స్వగృహంలో మృతి చెందారు. సౌమ్యుడుగా అందరినీ నోరార పలకరించి ఆప్యాయంగా పిలిచే మంచి మనిషి పుప్పాల నాగేశ్వరావు మృతి పట్ల పలువురు వారి స్వగృహానికి వెళ్ళి ఆయన భౌతికకాయంపై పుష్పగుచ్చాలు ఉంచి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శోకసముద్రంలో ఉన్న వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. భద్రాచలం డివిజన్ మున్నూరు కాపు సంక్షేమ సంఘం కన్వీనర్ ధనపనేని వెంకటేశ్వర్లు పటేల్ ఆయన భౌతిక కాయం పై పుష్పగుఛ్ఛాలు వుంచి నివాళులర్పించారు. అలాగే మున్నూరు కాపు సంక్షేమ సంఘం మండల నేతలు జక్కుల శ్యామ్ , జాపతి శ్యామ్ , అడపా శ్రీరాములు, దాసరి నారాయణరావు, అప్పాల శ్రీను, అడపా సత్యం, కూసం శాంభం ,ధనఫనేని నాగరాజు,సుద్ధపల్లి సత్యనారాయణ ఇంకా పలువురు మున్నూరు కాపు సంఘం నేతలు, సంఘం బాధ్యులు, రైతులు, పార్టీ ల నేతలు పుప్పాల నాగేశ్వరావు భౌతిక కాయానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యుల ను ఓదార్చారు.