ఆదర్శ పాఠశాలలో అలరించిన వార్షికోత్సవ వేడుకలు
– విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు
కాటారం, తెలంగాణ జ్యోతి : మండల కేంద్రంలోని ఆదర్శ హై స్కూల్ లో ఆదివారం రాత్రి నిర్వహించిన 36వ వార్షికోత్సవ వేడుకలు అలరించాయి. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు ప్రీ స్కూల్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను, మెడల్స్ ను తల్లిదండ్రుల సమక్షంలో అందజేశారు. యూకేజీ విద్యార్థులు ప్రీస్కూల్ విద్యను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలు అలరిం చాయి. ఈ సందర్భంగా ఆదర్శ విద్యా సంస్థల అధినేత జనగామ కరుణాకర్ రావు మాట్లాడుతూ…విద్యార్థులు చదువు తో పాటు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. గత 35 ఏళ్లుగా గ్రామీణ ప్రాంతంలో ఉత్తమ విద్యనందిస్తూ ఎంతో మంది విద్యార్థులను దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిలో నిలపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ హైస్కూల్ కరస్పాం డెంట్ జనగామ కార్తీక్ రావు, ప్రిన్సిపాల్ కృషిత, ఉపాధ్యా యులు పాల్గొన్నారు.