సమ్మె నోటీసును అందజేసిన వైద్య ఔట్సోర్సింగ్ సిబ్బంది
ములుగు, ఫిబ్రవరి10, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ఈనెల 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మెలో భాగంగా ములుగు హాస్పిటల్ సూపరిం టెండెంట్ జగదీష్, ఆర్ఎంఓ ప్రవీణ్ ప్రవీణ్ రెడ్డిలకు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ట్రేడ్ యూనియన్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ గాదె రమేష్ ఆధ్వర్యంలో సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు జరుగు తున్న అన్యాయాలు, పీఎఫ్, నెల నెల జీతాలు సరైన క్రమంలో రాకపోవడం వివరించి వైద్య కార్మికులకు ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మెకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన సూపర్డెంట్ కి మెడికల్ అండ్ హెల్త్ ఉమ్మడి వరంగల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గాదె రమేష్, ఎండి ఫజల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ స్టేట్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ ఎండి ఫజల్, వైద్య ఉద్యోగులు సురేష్, వేణు నాయక్, కృష్ణ, విజయ్ చందర్, స్వామి, సదయ్య, రాజయ్య, కుమార్, నాగరాజ్, రవి, కిరణ్, అన్ని విభాగాలకు చెందిన వైద్య విభాగ కార్మికులు పాల్గొన్నారు.