ప్రజాపాలన సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీపీ
తెలంగాణ జ్యోతి/ మహాదేవపూర్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కాంగ్రెస్ అరు గ్యారెంటిల సేవా కేంద్రాన్ని మండల పరిషత్ కార్యాయంలో సోమవారం ఎంపీపీ బి. రాణీ బాయి రామారావు రిబ్బిన్ కట్ చేసి ప్రారంభిచారు. ఇందిరమ్మ రాజ్యం లో ప్రజాపాలన అరు గ్యరెంటిల అమలు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐ టీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు సేవా కేంద్రం ప్రారంభించామని ఎంపీపీ బి. రాణీబాయి రామారావు అన్నారు. మహాదేవపూర్ మండల ప్రజలకు ఇందిరమ్మ పాలన, అరు గ్యారెంటీ లలోని సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వ అధికారులు, ఎంపీటీసీ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు, కార్యకర్తలు కృషి చేస్తారని, ప్రజాపాలన గ్రామ సభ రోజు గ్రామంలో లేని వారు, వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు దరఖాస్తు చేసుకోవాలని, ప్రజాపాలన దరఖాస్తు లో తప్పులను సరిచేసి నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు సేవా కేంద్రం ఏర్పాటు చేశామని ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎంపీపీ బి. రాణీబాయి రామారావు మనవి చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ అకుతోట సుధాకర్, ఎంపిఓ ప్రసాద్, కార్యాలయ సూపరిందేంట్ శ్రీధర్, సిబ్బంది అరుణ్ కుమార్, శ్రీహరి, శ్రీకాంత్, కార్యదర్శులు రాజ్ కుమార్, మంజూరు అహ్మద్, అంజలి, రాజు, సతీష్, రమేష్, దామోదర్, అటెందర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.