జిల్లా ఎమ్మార్పిఎస్ సభని సక్సెస్ చేయాలి
– ఎమ్మార్పిఎస్ మండల అధ్యక్షుడు చిరంజీవి మాదిగ
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణం లో ఈనెల 8వ తేదీన నిర్వహించ తలపెట్టిన పెద్దపల్లి జిల్లా స్థాయి ఎమ్మార్పిఎస్ సమావేశ సభను విజయవంతం చేయాలని కాటారం ఎమ్మార్పిఎస్ మండల అధ్యక్షుడు మంతెన చిరంజీవి మాదిగ ఓ ప్రకటనలో కోరారు. ఈ సభకు ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని చిరంజీవి మాదిగ తెలిపారు. మాదిగలు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కార మార్గానికై మంద కృష్ణ మాదిగ దిశా నిర్దేశం చేస్తారని వెల్లడించారు. కాటారం మండలంలోని ఎమ్మార్పిఎస్ నాయకులు, ఎమ్మార్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.