మందుబాబులకు అడ్డాగా ఎంపీడీఓ కార్యాలయం..?
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం: మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం మందుబాబులకు అడ్డాగా మారింది. బిల్డింగ్ పైన మద్యం సేవిస్తుండడంతో పరిసరాల్లో ఎక్కడా చూసిన మద్యం సీసాలే దర్శనమిస్తున్నాయి. అధికారులు విధులు నిర్వహించే కార్యాలయం పైన రాత్రి వేళలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న అధికారులు పట్టించు కోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. గత రెండు రోజుల క్రితం కొంతమంది మద్యం సేవించి ఇష్టానుసారంగా భవనం పైనే మద్యం సీసాలు వదిలేశారు. మద్యం సేవిస్తూ సిగిరెట్లు తాగుతూ ఇష్టానుసారంగా ప్రవరిస్తున్నారని స్థానికు లు తెలిపారు. మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్ట వేయా లని స్థానికులు కోరుతున్నారు.