ఎంపీడీవో కు కీబోర్డు ప్లేలో గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్

ఎంపీడీవో కు కీబోర్డు ప్లేలో గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్

ఎంపీడీవో కు కీబోర్డు ప్లేలో గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్

కాటారం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల పరిషత్ అధికారి యు. సుభాష్ చంద్ర బోస్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించారు. సంగీతంలో కీబోర్డు ద్వారా హల్లెల్ మ్యూజిక్ స్కూల్ బృందంతో డైరెక్టర్ ఆగస్టెన్ ప్రోత్సాహంతో ఈ రికార్డు సాధించారు, సంగీతం అంటే ఆయనకున్న మక్కువకి హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ద్వారా పాస్టర్ ఆగస్టెన్ ప్రోత్సాహం తోడవడంతో ఆయన ఈ రికార్డు సాధించా నన్నారు. హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ద్వారా ప్రపంచ స్థాయిలో జరిగిన మ్యూజిక్ ప్రదర్శనలో కీబోర్డు వాయిస్తున్న సంగీత కళాకారుల బృందం గంటలో 1046 వీడియోలు అప్లోడ్ చేశారు. ఏడాది పాటు ఆన్లైన్లో శిక్షణ పొందారు. డిసెంబర్ 1 వ తేదీన 2024 లో ఈవెంట్ జరగగా, ఈ నెల 14 తేదీన హైదరాబాదు లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధుల సమక్షంలో అగస్టెన్ చేతుల మీదుగా మెడల్ అందుకున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment