గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన డా.హెచ్.ప్రణీత్ కుమార్
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : సంగీత పోటీల్లో కీబోర్డ్ ప్లే చేయడంలో డా.హెచ్. ప్రణీత్ కుమార్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామపంచాయతీలో వైద్యాధికారిగా డాక్టర్ ప్రణీత్ కుమార్ వైద్య వృత్తిని కొనసాగిస్తూ సంగీతంలో పట్టు ఉండడం తో డిసెంబర్ 1న హలేల్ మ్యూజిక్ నిర్వహించిన స్కూల్ ఆన్ లైన్ సంగీత పోటీల్లో డా.హెచ్.ప్రణీత్ కుమార్ పాల్గొన్నారు. ప్రపంచ స్థాయిలో జరిగిన మ్యూజిక్ ప్రదర్శనలో అతను గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నారు. ఈ మేరకు గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధి ఆనంద్ రాజేంద్రన్ చేతుల మీదగా సర్టిఫికెట్, గోల్డ్ మెడల్ అందుకున్నారు.