వెంకటాపురం మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే తెల్లం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నుగూరు వెంకటాపురం మండలంలో భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గురువారం (3న) పర్యటించనున్నట్లు మండల తాసిల్దార్ పీ. లక్ష్మి రాజయ్య ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీని ప్రారంభిస్తారని, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.