ఆదర్శనగర్ కాలనీకి సత్వరమే మిషన్ భగీరథ నీళ్లు
కాటారం, తెలంగాణజ్యోతి ప్రతినిధి: జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం మండలం కాటారం గ్రామ పంచాయతీ లోని ఆదర్శ నగర్ కాలనీ లో గత వారం రోజుల నుండి మిషన్ భగీరథ నీరు రావడం లేదని కాలనీ వాసులు ఎడ్ల సతీష్, ఆత్మకూరి కుమార్, పెనుకొండ బాపు, పెద్దపల్లి మహేష్ అందరు కలిసి లికేజీ వున్న పైపు లైనను పరిశీలించారు. కాటారం గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ నాయిని శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీమల సందీప్ దృష్టికి తీసుకువెళ్తే వారు ఇద్దరు వచ్చి వాటర్ లికేజీ వున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మిషన్ భగీరథ ఏఈ రాజశేఖర్ కి సమస్యను వివరించారు. సంబంధిత అధికారులు రెండు రోజుల్లో పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాజీ ఉప సర్పంచ్ నాయిని శ్రీనివాస్ , యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీమల సందీప్ లకు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.