బాధిత కుటుంబానికి అండగా ఉంటాం : మాజీ ఎంపీపీ సమ్మయ్య

Written by telangana jyothi

Published on:

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం : మాజీ ఎంపీపీ సమ్మయ్య

కాటారం,తెలంగాణ జ్యోతి ప్రతినిధి: జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం మండలం కాటారం గ్రామ పంచాయతీ లోని బొమ్మన వాడకు చెందిన కొండ గొర్ల బాబు రెండు రోజుల క్రిందట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా సోమవారం ఉదయం మరణించాడు. విషయం తెలుసుకొని కాటారం మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, కాటారం మాజీ ఉపసర్పంచ్ నాయిని శ్రీనివాస్ కుటుంబం సభ్యులను పరామర్శించారు. మృతుడు బాపు ఇద్దరు అమ్మాయిలను ఓదార్చారు. అనంతరం మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య ఆ ఇద్దరు అమ్మాయిలతో మాట్లాడు తూ ధైర్యంగా ఉండాలని పై చదువులు, వైద్యం పరంగా ఆదుకుంటామని పిల్లలకు హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం దృష్టికీ తీసుకెళ్లి బాధితుడి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Leave a comment