రన్నింగ్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కు ఎన్నికైన మైనార్టీ విద్యార్థిని
ములుగు, తెలంగాణ జ్యోతి : మండలంలోని దేవగిరిపట్నం మైనార్టీ పాఠశాలకు చెందిన ఎండి రేష్మ 19 నేషనల్ ఇంటర్ డిస్టిక్ లెవెల్ రన్నింగ్ లో 60 మీటర్ల విభాగంలో సెలెక్ట్ అయ్యి అంతర్జాతీయ స్థాయిలో గుజరాత్ లో జరిగే రన్నింగ్ పోటీలకు ఎంపికయినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ శైలజ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శైలజ ఎండి రేష్మకు మెమొంటోను అందించి అభినందించారు. ఈ పోటీలలో విజయానికి కారణమైన పీటి టీచర్ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.