మంత్రి శ్రీధర్ బాబుచే సన్న బియ్యం పంపిణీ ప్రారంభం
కాటారం, తెలంగాణ జ్యోతి : కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ పథకాన్ని శుక్రవారం కాటారంలో మంత్రి శ్రీధర్ బాబు శుక్రవారం ప్రారంభిస్తారని మండలతహసీల్దార్ నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. కాటారం సబ్ డివిజనల్ ఆఫీసు పరిధిలో గల మహాముత్తారం, మలహర్, మహదేవపూర్, కాటా రం, పలిమెల మండలాల లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభిస్తారని, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కలెక్టర్ మయాంక్ సింగ్ జిల్లాలోని వివిధ శాఖల అధికా రులు పాల్గొంటారని తెలిపారు. ప్రజలందరూ పాల్గొని కార్యక్రమా న్ని విజయవంతం చేయాలని తహసిల్దార్ నాగరాజు తెలిపారు.