వేసవిలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి 

వేసవిలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి 

వేసవిలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి 

– జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మధుసూదన్

కాటారం, తెలంగాణ జ్యోతి : వేసవిలో ప్రజలు వ్యాధుల బారిన పడకుండా, వడదెబ్బకు గురి కాకుండా చేపట్టాల్సిన చర్యలపై ప్రజలకు ఆశ సిబ్బంది అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ అన్నారు గురువారం ఆశా డే, అత్యవసర సేవలపై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేసవిలో ప్రజలు వడదెబ్బకు గురైతే చికిత్స కోసం ఓఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయని,  రాబోయే వర్షాకాలం ముందే చేపట్టాల్సిన జాగ్రత్త చర్యలను సూచించారు. ఆషా డే సందర్భంగా ఆశ ఏఎన్ఎం లకు 108, 102 సర్వీసెస్ ల ఎలా ఉపయోగపడుతాయ నే విషయం పై అవగాహన కల్పించారు. వేసవికాలం లో వడదెబ్బ గురయిన వారికి ప్రథమ చికిత్స చేయాలి? అంబులెన్స్ లో వడదెబ్బకు సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ కిట్, ఐస్ ప్యాక్స్ చిల్లర్ బాక్స్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఎటువంటి అత్యవసర సేవలకైన 108,102 ఎన్ సి పి, ఎం సి చెక్ అప్స్, డెలివరీ అయిన తర్వాత హాస్పిటల్ నుండి ఇంటికి మదర్ అండ్ చైల్డ్ డ్రా బ్యాక్ జాగ్రత్తగా ఇంటి వద్దకి చేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి మధుసూదన్ , 108 /102 డిస్టిక్ మేనేజర్ మెరుగు నరేష్, వైద్యాధికారి మౌనిక, హాస్పటల్ సిబ్బంది 108 స్టాప్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ శ్రీకాంత్, పైలట్ విజేందర్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment