డిప్యూటీ సీఎం, ఎంఎల్ఏ లకు మంత్రి శ్రీధర్ బాబు శేష వస్త్ర సన్మానం
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దన్వాడలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు విజయరమణ రావు, మక్కాన్ సింగ్, ప్రేమ్ సాగర్ రావు, గండ్ర సత్యనారాయణ దర్శించుకున్నారు. శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేలను స్వామి వారి శేష వస్త్రాలతో మంత్రి శ్రీధర్ బాబు సన్మానించారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు.
1 thought on “డిప్యూటీ సీఎం, ఎంఎల్ఏ లకు మంత్రి శ్రీధర్ బాబు శేష వస్త్ర సన్మానం”