మంత్రి శ్రీధర్ బాబు ఊరికి వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : మంథని నియోజక వర్గములోని కాటారం మండలం ధన్వాడ గ్రామములో శ్రీ దత్తాత్రేయ, శివపార్వతి, గణపతి, ఆదిత్య నందికేశ్వర భక్తాంజనేయ ఆలయ 3వ వార్షికోత్సవ కార్యక్రమానికి తెలం గాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విచ్చేశారు. ఈ సందర్భంగా భట్టి కి దుద్దిల్ల శ్రీను బాబు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ఐ టీ మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు స్వగ్రామం ధన్వాడ లో దత్త గుడి వార్షికోత్సవం వేడుకలకు భట్టి హాజరయ్యారు. మంథని నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంథని నియోజకవర్గానికి విచ్చేసిన డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క కి శాలువాతో సత్కరించి శ్రీను బాబు ఘన స్వాగతం పలికారు. మంథని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
1 thought on “మంత్రి శ్రీధర్ బాబు ఊరికి వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి”