ఫైనల్ మ్యాచ్ ను ప్రారంభించిన మంత్రి సీతక్క తనయుడు సూర్య.

ఫైనల్ మ్యాచ్ ను ప్రారంభించిన మంత్రి సీతక్క తనయుడు సూర్య.

ములుగు, తెలంగాణ జ్యోతి : జిల్లా కేంద్రంలోని తంగేడు స్టేడియంలో ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ములుగు వర్సస్ దేవగిరిపట్నం మద్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ను కాంగ్రెస్ పార్టీ యవజన రాష్ట్ర ప్రదాన కార్యదర్శి దనసరి సూర్య ముఖ్యఅతిథిగా హజరై టాస్ వేసి ప్రారంభించా రు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయాని, క్రీడాలలో స్నేహ భావం పేంపోదుతుం దన్నారు. క్రీడా స్ఫూర్తితో క్రీడాకారులు మాటలను ఆడి విజయం సాదించాలని కోరారు. క్రీడలలో గెలుపు ఓటములు సహజమన్నారు. క్రీడల వల్ల క్రీడాకారులు తమ జీవితాల్లో ఏ పని చేసిన గెలవాలని తపనతో పనిచేస్తారని, అందుకే క్రీడలు మానవ జీవితంలో చాలా ముఖ్యమని అన్నారు. ఇరు జట్లు పోటి పడగా దేవగిరిపట్నం జట్టు12 ఓవర్లులో 69 పరుగులు సాదించగా రెండవ బ్యాటింగ్ చేపట్టన ములుగు జట్టు 46 పరుగుకు ఆలౌట్ కాగా దేవగిరి పట్నం జట్టు విజయం సాదించింది. ఈ పోటిలకు గాను ఈనేల 25వ తేదిన పంచాయితి రాజ్ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా బహౌమతుల ప్రదానం చేయనున్నట్లు నిర్వహకులు ఆదర్శ యూత్ సభ్యులు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బానోతు  చందర్, ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బాదం ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వంగరవ యాదవ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చింత నిప్పుల బిక్షపతి, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు కుద్బుద్దిన్, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ ఉపాధ్యక్షులు గందె శీను, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు కోటి, బీసీ సెల్ కోశాధికారి ఓడ రాజు, వర్కింగ్ యూత్ మండల అధ్యక్షులు బండి మధు, నియోజకవర్గ ఇన్చార్జి శ్రీకాంత్ రెడ్డి, డైరెక్టర్ బోయిని రాజు, అప్రోజ్, ఆదర్శ యూత్ సభ్యులు ఉల్లేరావు సాయి, గుగ్గిల్ల సుజన్, శ్రవణ్, అఖీల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment