మృతుల కుటుంబాలకు పరామర్శ
ములుగు, తెలంగాణ జ్యోతి : నిరుపేద మృతుల కుటుంబాలకు సాయం అందించిన సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ & ఫౌండేషన్ వ్యవస్థాపకులు, మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ సహృదయాన్ని చాటుకున్నారు. ములుగు మండలం సర్వపూర్ గ్రామానికి చెందిన గుండ్ల నర్సమ్మ ఇటీవలే అనారోగ్యంతో మరణించగా విషయం తెలుసుకున్న తస్లీమా ఆదివారం వెళ్ళి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆమె మరణం బాధాకరమని మృతురాలి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలోనే ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను ఓదార్చారు. సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ & ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50కేజీల బియ్యం,రూ. వెయ్యి అందించారు. అదేవిధంగా ములుగు మండలం రామచంద్రాపూర్ గ్రామానికి భానోత్ బాబురావు నాయక్ ఇటీవలే అనారోగ్యంతో మరణించ గా విషయం తెలుసుకున్న తస్లీమా ఆదివారం వెళ్ళి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అతడి మరణం బాధాకరమని మృతుడి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలోనే ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను తస్లీమా ఓదార్చారు. తస్లీమా వెంట సర్వర్ చారిట బుల్ ట్రస్ట్,ఫౌండేషన్ సభ్యులు,గ్రామస్థులు, తదితరులు ఉన్నారు.