గట్టమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి కొండా సురేఖ
ములుగు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ తల్లిని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి బుదవారం కొండా సురేఖ దర్శించుకున్నారు. ములుగు జిల్లా కు విచ్చేసిన మంత్రి సురేఖ కు పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి సంస్థ & స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్వాగతం పలికారు. మేడారం మహా జాతర ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తల్లిని కోరుకున్నారు. మొదటి సారి మంత్రి హోదాలో కొండ సురేఖ ములుగు జిల్లాకు రావడం గట్టమ్మ తల్లిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ పి శబరిష్, డి ఎఫ్ ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఆర్ డి ఓ సత్య పాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.