యోగాతో మానసిక ఒత్తిడి, ఆరోగ్య పరిరక్షణ 

Written by telangana jyothi

Published on:

యోగాతో మానసిక ఒత్తిడి, ఆరోగ్య పరిరక్షణ 

– యోగా గురువు స్వామి రెడ్డి. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి : అంతర్జాతీ య యోగా దినోత్సవం సందర్భంగా, శుక్రవారం ఉథయం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ అతిథి గృహం ఆవరణలో, ఉదయం యోగాను నిర్వహిం చారు. ఈ సందర్భంగా యోగా గురువు స్వామి రెడ్డి యోగా లో పాల్గొన్న వారికి ,యోగా వల్ల కలిగే ప్రయోజనాలను క్షుణ్ణంగా వివరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ను, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూన్ 21 వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవం గా ప్రకటించారు. ఈ మేరకు వెంకటాపురం మండల కేంద్రంలో మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, అనేకమంది యోగ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యాయామం అనంతరం యోగాను ప్రతిరోజు 30,నుండి 40 నిమిషాలు పాటు నిర్వహిస్తే, మానసిక ఒత్తిడి తట్టుకొని, సంపూర్ణ శక్తివంతులు అవుతారని, సంపూర్ణ ఆరోగ్య వంతులవుతారని యోగ గురువు స్వామి రెడ్డి యోగా యొక్క ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు అట్లూరి రఘురాం, పార్టీ నాయకులు సంకా శ్యామసుందర్, చిట్టెం సంజీవరావు, కేప నరసింహారావు ,అంకాల దుర్గ ,సాధన పెళ్లి విజయ్, తోట సతీష్, నోముల శ్రీ కిషన్, క్యాప పుల్లయ్య, రాజశేఖర్ పలువురు యోగాలో పాల్గొన్నారు.

Leave a comment