పేదల ఇంటి స్థల పోరాటానికి సీపీఐ(ఎం)పార్టీఅండ
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బీ రెడ్డి సాంబశివ, గ్యానం వాసు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ఆదివాసీ గిరిజనులు నిలువ నీడ (ఇంటి) స్థలం కోసం చేస్తున్న పోరా టానికి సీపీఐ(ఎం) పార్టీ అండగా ఉంటుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బీ రెడ్డి సాంబశివ, గ్యానం వాసు హామీ ఇచ్చారు. ములుగు జిల్లా నూగూరు వెంకటాపు రం మండల పరిధిలోని, బొదాపురం గ్రామము లో ఉన్న ,ప్రభుత్వ స్థలంలో సీపీఐ(ఎం) ఆలు భాక జోన్ కమిటీ ఆధ్వర్యంలోఆదివాసీలు ఇంటి స్థలాల కోసం పాకలు వేశారు. ఈ ప్రాంతాన్ని సీపీఐ(ఎం) !బృందం గురువారం పరిశీలిం చారు. పేదలన్యాయ పోరాటానికి పూర్తిస్థాయిలో అండగా ఉంటామని సీపీఐ(ఎం)నాయకులు అధివాసీలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బీ రెడ్డి సాంబశివ, గ్యానం వాసు మాట్లాడుతూ ప్రభుత్వ స్థలంలో కొందరు అన్యాక్రాంతం చేయాలని ప్రయత్ని స్తున్నారని.ఈ విషయాన్ని పలు మార్లు రెవెన్యూశాఖ అధికా రులకు సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అంద జేశామన్నారు. అ స్థలంలో ఇంటి స్థలం లేని ఆదివాసీల కు కేటాయించాలని వినతి పత్రంలో కోరినట్లు వివరించారు. కానీ ఈ స్థలాన్ని ఆదివాసీ పేదలకు కేటాయించ క పొగ, ఒక రెవెన్యూశాఖ ఉద్యోగే ఆ స్థలం కబ్జా చేయాలని చూస్తుంటే అతనిపై చర్యలు తీసుకోకుండా, అతనికే రెవెన్యూశాఖ అధికారులు సహకారం అందిస్తున్నారని ఆరోపించారు. అందుకే నిలువ నీడ లేని ఆదివాసీలు, ఈ ప్రభుత్వ స్థలంలో ఇంటి నిర్మాణం కోసం గుడిసెలు వేశారని వివరించారు. ఆదివాసీ ల గుడిసెల పోరాటానికి సీపీఐ(ఎం) పార్టి అండగా ఉంటుందని అధివాసీలకి హామీ ఇచ్చారు.ఈ పోరాటంలో సీపీఐ(ఎం) వెంకటాపురం మండల కార్యదర్శి కుమ్మరి శ్రీను, నాయకులు పాండా శ్రీను, కృష్ణ, తోటపల్లి రాము, ఆదివాసీలు పాల్గొన్నారు.