కాటారంలో వైద్య సిబ్బంది నిరసన

Written by telangana jyothi

Published on:

కాటారంలో వైద్య సిబ్బంది నిరసన

 కాటారం , తెలంగాణ జ్యోతి ప్రతినిధి: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్ కత్తా ఆర్ జి కార్ మెడికల్ కాలేజీ విద్యార్థిని డాక్టర్ మౌమిత డెబాణాత్ (31) పై ఈనెల 8న జరిగిన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల చే సామూహిక అత్యాచారం, హత్యకాండకు నిరసిస్తూ శనివారం కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిరసన తెలియజేసింది. ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మౌనిక, డాక్టర్ ప్రియాంక, డాక్టర్లు ఇతర సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి ప్ల కార్డులతో నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

Leave a comment