సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి 

Written by telangana jyothi

Published on:

సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి 

– కాటారం ఎంపీపీ పంతకాని సమ్మయ్య

కాటారం ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : వర్షకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాలని, రోగులకు సరిపడా మందులు అందు బాటులో ఉండాలని, అలాగే ఆసుపత్రికీ వెచ్చే రోగుల పట్ల స్నేహ పూర్వకంగా ఉండాలని ఎంపీపీ సమ్మయ్య అన్నారు. కాటారంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అభివృద్ధి కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో ఎంపీపీ సమ్మయ్య మాట్లాడారు. అలాగే ఆసు పత్రికీ సంబందించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై డాక్టర్ మౌనికతో, ఆసుపత్రి సిబ్బందితో చర్చించారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్బంగా ఎంపీపీ సమ్మయ్య అధ్యర్యంలో డాక్టర్ మౌనిక ను శాలువా తో సన్మానించి, స్వీట్స్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్ర మంలో ఎంపీపీ పంతకాని సమ్మయ్య, ఎంపీడీఓ అడ్డురి బాపు, ఏపీఓ వెంకన్న, డాక్టర్ మౌనిక ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment