మూతపడే దశకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాలలు..!

Written by telangana jyothi

Published on:

మూతపడే దశకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాలలు..!

– పేద విద్యార్థుల కొరకు ప్రభుత్వ పాఠశాలలు తెరిపియాలని తల్లిదండ్రుల వేడుకలు

నర్సంపేట, తెలంగాణ జ్యోతి : ఎందరో మేధావులను, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులను, వ్యాపారవేత్తలను, విద్యని అందించిన ప్రభుత్వ పాఠశాలలు నేడు విద్యార్థులు లేక మూతబడే దశకు చేరకున్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ బాగా తగ్గడంతో నర్సంపేట వ్యాప్తంగా పలు గ్రామాలలో పలు పాఠశాలలు మూతబడే దశకు చేరుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి ఎన్నోరకాల సదుపాయా లను తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం కల్పిస్తున్నప్పటికీ విద్యార్థులు లేక పాఠశాలలు వెలవెల బోతున్నాయి. వివరాల్లోకి వెళితే… నర్సంపేట రాజుపేట గ్రామపంచాయతీ పరిధిలో జంగాలపల్లి తండాలో పాఠశాల మూతపడి ఉంది అదేవిధంగా ఖానాపూర్ మండలం చిలకమ్మ తండా గ్రా మపంచాయతీలో గల ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు లేక పాఠశాల ఉపాధ్యాయునికే పరిమితమైంది ఆ ఉపాధ్యాయు డు ఎప్పుడూ పాఠశాలకు వస్తాడు అక్కడి ప్రజలకు తెలియదు. ఇది ఇలా ఉండగా అయోధ్య నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో గత రెండు సంవత్సరాల క్రితమే ప్రభుత్వ పాఠశాల మూతపడి ఉంది. మరి కొన్ని గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఒకరు ఇద్దరు ఉంటున్నారు ఆ విద్యార్థులకు వారికి పాఠాలు నేర్పడానికి ఉపాధ్యాయులు ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు. ఇది ఇలా ఉంటే మూతపడిన ప్రభుత్వ పాఠశాలలను కొందరు వ్యక్తులు వారి స్వంత అవసరాల కోసం వాడుకుంటున్నారు అని ప్రజలు వాపోయారు ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం దృష్టి సారించి మూతబడిన పాఠశాలను తెరిపించి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాలని ఆ గ్రామస్తులు, పేద ప్రజలు కోరుకుంటున్నారు.

మూతపడే దశకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాలలు..!

Leave a comment